PDPL: గుండె ఆగిపోయిన వారికి తక్షణ సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని డీఎంహెచ్ డా. వాణిశ్రీ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం సీపీఆర్ అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణ ప్రజలు కూడా ఈ మెళకువలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమాలు అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరుగుతాయని తెలిపారు.