KMR: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మద్దతు ధర పోస్టర్లను సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ విడుదల చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు తెలియజేశారు.