NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మెప్మా మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు అందజేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ పీడీ పవన్ కుమార్ తెలిపారు. నగరంలోని 1వ డివిజన్ కాలూరులో మంగళవారం అంగీకార కార్యక్రమం నిర్వహించారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం ఆయా దశల్లో రూ. 5 లక్షలు ఆర్థిక చేయూతనందిస్తుందని తెలిపారు.