PPM: మన్యం జిల్లాలోని ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని, ఆ దిశగా అధిక రాబడి వచ్చే పంటలు, వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. అంతర పంటలు వేయడం, ఖాళీగా ఉండే పొలం గట్ల మీద ఆకుకూరలు, పూలమొక్కల పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. పొలాల్లో అధిక ఆదాయం వచ్చే విత్తనాలు వేయాలన్నారు.