ADB: గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని DIEO కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ అధ్యాపకులకు సమానంగా భోధన చేస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు లభించడం లేదని వాపోయారు. గత 8 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.