VZM: పాఠశాలల్లో మౌలికవసతులు మెరుగు పర్చాలని కలెక్టర్ రామ సుందర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. మంగళవారం రామభద్రపురం మండలం ఆరికతోట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, బాడంగి మండలంలో కస్తూరిబా బాలిక విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే తాగునీటిని కలెక్టర్ స్వయంగా పరిశీలించి తాగునీరు సేవించారు. అనంతరం వంటశాలను పరిశీలించారు.