బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రిగా జీతం సరిపోవడం లేదన్న సహచర ఎంపీ సురేశ్ గోపీ వ్యాఖ్యలకు ఆమె మద్దతు పలికారు. రాజకీయాలు అత్యంత కఠినమైన వృత్తి అని, ఇక్కడ వేతనం చాలా తక్కువగా ఉంటుందని కంగన అభిప్రాయపడ్డారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందని సురేశ్ గోపీ చెప్పడాన్ని ఆమె సమర్థించారు.