AP: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వ చారిత్రక ఒప్పందంపై మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం చరిత్రాత్మక ఘట్టమన్నారు. చంద్రబాబు, లోకేష్ దూరదృష్టి ఫలితమే ఈ గొప్ప ఒప్పందమని కొనియాడారు. దీంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి నూతన యుగం ప్రారంభం అయిందని తెలిపారు. ప్రపంచపటంలో విశాఖకు కొత్త గుర్తింపు రానుందని సంతోషం వ్యక్తం చేశారు.