సత్యసాయి: పుట్టపర్తిలో చిత్రావతి రోడ్డు సుందరీకరణ పనులను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీవో సువర్ణ, డీఎస్పీ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ సోమవారం పరిశీలించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను సూచించారు. త్వరలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు.