రాకేష్ శర్మ భారతదేశపు మొట్టమొదటి గగనయాత్రికుడు. 1949లో పంజాబ్‌లో జన్మించిన ఆయన భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేశారు. 1984లో Soyuz T-11 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి Salyut 7 అంతరిక్ష కేంద్రంలో 8 రోజులు గడిపారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను ‘భారతదేశం అంతరిక్షం నుండి ఎలా కనిపిస్తుంది?’ అని అడిగితే, ‘సారే జహాం సే అచ్చా’ అని సమాధానమిచ్చారు.