AKP: గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్వో సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు, కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.