KNR: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చొప్పదండి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో పత్రాలను అందచేశారు. పద్మాకర్ రెడ్డి చొప్పదండి సింగిల్ విండో చైర్మన్ గా సీనియర్ నేతగా పార్టీ సేవలు అందిస్తున్నారు.