PDPL: అంతర్గం మూర్ముర్ ప్రాంతాల ఆటో డ్రైవర్లతో ఎస్సై వెంకటస్వామి సోమవారం సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. లైసెన్స్ లేకుండా ఆటో నడపరాదని, మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆయన కోరారు. మద్యం సేవించి ఆటో నడపడం నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. గంజాయి రవాణా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.