ప్రకాశం: సిద్ధయోగిని గురు మాతాజీ ఆధ్వర్యంలో కనిగిరిలో ఈనెల 16వ తేదీ నుండి సప్త సప్తాహ పారాయణ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పవరపు సత్యాలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..16వ తేదీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై డిసెంబర్ 3వ తేదీ వరకు (49 రోజులు) సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.