TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 15 నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశాలున్నాయని అంచనా వేసింది.