NGKL: అచ్చంపేట మండలంలోని పల్కపల్లి గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు వేరుశనగ విత్తనాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. ఒక్కో రైతుకు 100% సబ్సిడీ మీద విత్తనాలు పంపిణీ చేశారు.