CTR: కారు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన బుధవారం కేజీ సత్రం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇవాళ ఉదయం కొరివివారిపల్లెకు చెందిన వెంకటస్వామి బైకు మీద వెళుతుండగా బంగారుపాళ్యం నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.