NZB: సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి పేర్కొన్నారు. బజ్ నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో పలువురు నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారన్నారు.