ELR: విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రమణారావు డిమాండ్ చేశారు. ఇవాళ బువ్వనపల్లి విద్యుత్ కార్యాలయంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఈనెల 17న సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.