JGL: మల్యాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది పనితీరును అంచనా వేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో డీఎస్పీ రఘు చందర్, సీఐ రవి, ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.