WGL: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డిని పరామర్శించారు. దొంతి తల్లి కాంతమ్మ దశదినకర్మ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో మంత్రి, విప్ పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. అనంతరం MLAను, ఆయన సోదరులను వారు పరామర్శించి, తమ సానుభూతి తెలిపారు.