AP: గత పాలకులు చేసిన విధ్వంసంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టిందని తెలిపారు. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశామని చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌ను సక్సెస్ చేద్దామని పిలుపునిచ్చారు.