KMM: ఖమ్మం కలెక్టరేట్లో ఇవాళ వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్లతో అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్లను ఏర్పాటు చేయాలన్నారు. అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని సూచించారు.