అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలోని జగనన్న కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంలో కాలనీల్లో ఇళ్లు నిర్మించుకొనేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యుత్, కాలువు, త్రాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడం లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడంలేదు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.