NLG: చిట్యాల మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ మండల కమిటీ ఇవాళ చిట్యాల తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందించింది. పత్తి దిగుబడి వచ్చినందున రైతులు, దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. దానితో పాటు మద్దతు ధరను అందించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల నేతలు ఉన్నారు.