W.G: బాణసంచా విక్రయ దుకాణాలు, తయారీ దారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ హెచ్చరించారు. అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాణసంచా విక్రయించినా, అమ్మినా, నిల్వ చేసినా 101కు, లేదా స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.