ప్రభుత్వ టెలికామ్ సంస్థ BSNL దీపావళి సందర్భంగా ‘బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా’ పేరిట రూ.1కే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.1కే 30 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తోంది.