HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ ప్రచురణ నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫారం మాధ్యమాలకు వర్తిస్తుందని, ఆదేశాలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష ఉంటుందన్నారు.