ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ పోశెట్టి మంగళవారం రాత్రి మాహోర్ నుంచి బోథ్‌కు వస్తుండగా మాహోర్ ఘాట్లలో వాహనం నడుపుతూనే కుప్పకూలి మృతి చెందాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమారు 60 మంది గుస్సాడీ వేషధారణతో మాహోర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ పక్కన ఉన్న వ్యక్తి సమయస్ఫూర్తితో వాహనాన్ని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది .