కృష్ణా: నందివాడ మండలం గొంగలముడి గ్రామం నుంచి దండిగానపూడి వెళ్లే ప్రధాన రహదారిపై ఒక చెట్టు విరిగిపడి రహదారి మధ్యలో పడిపోయింది. దీంతో వాహనాల ఇటువైపు రాకపోకలు సాగించాలంటే ప్రమాదకరంగా మారిందని వాహనదారులు బుధవారం వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి, విరిగిపోయి ఉన్న చెట్టును తొలగించి,గుంతలను పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.