WGL: జిల్లా వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం షాపులకు టెండర్లు వేయడానికి వ్యాపారులు విముఖత చూపుతున్నారు. ఇప్పటివరకు 31 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఒక్కో షాపుకు కనీసం 10 దరఖాస్తులు కూడా రాలేదు. ఈ పరిస్థితితో ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుని ఆందోళనపడుతున్నారు.