AP: దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన వ్యక్తి అని కొనియాడారు. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అని గుర్తుచేశారు. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్ అన్నారు.