NLR: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో సెక్యూరిటీ అంశంపై వింజమూరు మండలం యర్రబల్లిపాలెంకు చెందిన గోదాల స్రవంతికి మోహన్ బాబు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ మేరకు ప్రొ. డాక్టర్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనలకు ఈ డాక్టరేట్ లభించింది. డాక్టరేట్ పొందడంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.