హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.