KMR: జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు.