JNG: పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, MLA యశస్విని రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని మారుమూల ఆవాస ప్రాంతాలు, తండాలకు రోడ్ల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30కోట్లు విడుదల చేసిందని వారు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి, సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.