W.G: ప్రపంచ స్థాయిలో భారతదేశ ఔనత్యాన్ని వ్యాపింపజేసిన అబ్దుల్ కలాంను నేటి యువత, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని రిటైర్డ్ డీఈవో ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. భీమవరంలో భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఇవాళ నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణంరాజు, కలిగొట్ల గోపాల శర్మ, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.