NTR: అధిక వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలి జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో సుమారుగా 20వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 8,110 ధరతో పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.