SKLM: బూర్జ మండలం పరిధిలో పాలకొండకు వెళ్లే రహదారి వద్ద చాలాచోట్ల గుంతలు ఏర్పడడంతో ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు తన సొంత నిధులతో మరమ్మతు పనులు చేపట్టారు. బుధవారం పాలవలస, లక్కుపురం, తుడ్డలి, మర్రిపాడు జంక్షన్ల వద్ద మరమ్మతు పనులను ఆయన పర్యవేక్షించారు.