HYD: జూబ్లీ ఉప ఎన్నికలకు మూడోరోజు నామినేషన్ల గడువు ముగిసింది. మూడోరోజు 10 మంది అభ్యర్థులు మొత్తం 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 30కి చేరింది. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈనెల 17న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.