అన్నమయ్య: మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎంపీ ఆనందన్ అన్నారు. కలాం జయంతిని పురస్కరించుకుని ఇవాళ మదనపల్లెలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్త విద్యావంతుడిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.