AP: నకిలీ మద్యం నుంచి బయటపడటానికి కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేసును జోగి రమేష్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం సూత్రధారులు TDP నేతలేనని ఆరోపించారు. ఈ దందా 2 నెలలుగా జరుగుతోందని ఎక్సైజ్ అధికారులన్నారని చెప్పారు. చిత్తశుద్ది ఉంటే బార్లు, వైన్ షాపుల్లో తనిఖీలు జరపాలని డిమాండ్ చేశారు.