ADB: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. ఆరుకాలం కష్టపడి పని చేసి పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు అన్నదాతకు శాపంగా మారాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పండిస్తున్న పత్తి, సోయాబీను, మొక్కజొన్న, జొన్నలు వంటి పంటలు తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.