ఖమ్మంలో మొక్కజొన్న పంటను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించనుంది. ఉమ్మడి జిల్లాలో 98,554 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అత్య ధికంగా భద్రాద్రి జిల్లాలో 96,864, ఖమ్మంలో 1,690 ఎకరాల్లో సాగు చేశారు. భద్రాద్రిలో 20, ఖమ్మంలో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్నలకు రూ.2,225మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది కేంద్రం రూ.2,400గా ప్రకటించింది.