NGKL: అచ్చంపేటకి చెందిన విజయ లక్ష్మీ ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆమెను సన్మానించి అభినందించారు. మాజీ సర్పంచ్ పిల్లి హరిచంద్ర సోదరుని కుమార్తె అయిన విజయలక్ష్మి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.