JGL: విద్యార్థులు సోషల్ మీడియాకు ముఖ్యంగా ఫోన్లకు దూరంగా ఉండాలని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ అన్నారు. జగిత్యాల జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.