SRCL; వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 109వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం సమితి సభ్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. హనుమాన్ చాలీసా పారాయణంతో మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు.