BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. బుధవారం ఉదయం 1,40,310 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ప్రవాహం స్థిరంగా ఉంది. సుందిళ్ళ, పార్వతి బ్యారేజీలు, ఎల్లంపల్లి, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.