KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు ఏలేశ్వరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే GST అవగాహన ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలేశ్వరం హైస్కూల్లో 2025 డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.