SKLM: జిల్లా జైళ్లలో ఉన్న ముద్దాయిల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జనైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టులో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో క్రైమ్ రేటును తగ్గించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.